పాక్ ఆర్మీకి బిగ్ షాక్.. 13 మంది సైనికులు మృతి
పాకిస్థాన్ ఆర్మీకి భారీ నష్టం జరిగింది. గులామ్ ఖాన్ బోర్డర్ ఏరియాలో ఆర్మీ కాన్వాయ్‌పై TTP మిలిటెంట్లు ఆకస్మిక దాడి చేశారు. ఈ ఘటనలో ఏకంగా 13 మంది పాక్ సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ఆజాద్ మండి బజార్ దగ్గర వెళ్తుండగా ఈ ఘోరం జరిగింది. దీంతో అక్కడ యుద్ధ వాతావరణం నెలకొంది. ఆర్మీ అధికారులు వెంటనే అప్రమత్తమై అదనపు బలగాలను ఘటనా స్థలానికి తరలించారు.