గుర్తుతెలియని వాహనం ఢీకొని మహిళ మృతి

గుర్తుతెలియని వాహనం ఢీకొని మహిళ మృతి

ప్రకాశం: జే పంగులూరు మండలం అలవలపాడు జాతీయ రహదారిపై మంగళవారం రోడ్డు ప్రమాదం జరిగింది. గుర్తు తెలియని వాహనం ఢీకొని కృష్ణా జిల్లాకు చెందిన కుమారి అనే మహిళ మృతి చెందింది. స్థానికుల సమాచారంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.