VIDEO: అంగన్‌వాడీ సిబ్బందికి మొబైల్ ఫోన్ల పంపిణీ
NRML: భైంసా పట్టణంలో ఈరోజు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పోషణ అభియాన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ అంగన్‌వాడీ సిబ్బందికి మొబైల్ ఫోన్లు పంపిణీ చేశారు. గర్భిణీలు, బాలింతలు, చిన్నారుల ఆరోగ్య మెరుగుదలే లక్ష్యమని తెలిపారు. మొబైల్ ఫోన్లతో సమాచారాన్ని సులభంగా నమోదు చేసి ప్రభుత్వానికి చేరవేయవచ్చన్నారు.