చికిత్స పొందుతూ యువకుడి మృతి
KRNL: ఎమ్మిగనూరు పట్టణానికి చెందిన రఘు (25) అనే యువకుడు రోడ్డు ప్రమాదంలో గాయపడి, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రాత్రి మృతి చెందినట్లు పట్టణ సీఐ శ్రీనివాసులు తెలిపారు. ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా అదుపుతప్పి కిందపడి తీవ్రంగా గాయపడినట్లు, చికిత్స కోసం ఆసుపత్రికి తరలించగా కోలుకోలేక మరణించినట్లు చెప్పారు. ఈ ఘటనపై భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు