బసవేశ్వర చిత్రపటానికి నివాళులర్పించిన కలెక్టర్

WGL: శ్రీ బసవేశ్వర మహారాజ్ జయంతిని పురస్కరించుకొని వరంగల్ కలెక్టరేట్లో కలెక్టర్ సత్య శారదా దేవి బసవేశ్వర చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. సమాజంలో కుల వ్యవస్థ, వర్ణ భేదాలు, లింగ వివక్షతను సమూలంగా వ్యతిరేకించిన అభ్యుదయవాది బసవేశ్వర మహారాజ్ అని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ సిబ్బంది తదితరులున్నారు.