'విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలి'
MDK: గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని మండల విద్యాధికారి వెంకటేశం పేర్కొన్నారు. పెద్ద శంకరంపేట మండలం కొత్తపేట ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను ఆయన తనిఖీ చేశారు. విద్యార్థులకు బోధన సామర్ధ్యాలకు అనుగుణంగా బోధన జరగాలని సూచించారు.