VIDEO: ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం
SRD: జిన్నారం మున్సిపల్ కేంద్రంలో శుక్రవారం రాత్రి ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయంగా మారింది. పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోగా, రోడ్లపై నీరు నిలిచిపోవడంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వర్షం కారణంగా ఇంటిముందు మురుగునీరు వచ్చి చేరడంతో లోతట్టు ప్రాంత ప్రజలు ఇబ్బందులు పడ్డారు.