ఎమ్మిగనూరులో లెనిన్ జయంతి వేడుకలు
KRNL: ఎమ్మిగనూరులో ఇవాళ లెనిన్ 156వ జయంతి, సీపీఐ(ఎంఎల్) 57వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఐఎన్టీయూ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో లెనిన్ చిత్రపటానికి పార్టీ, కార్మిక సంఘాల నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. సమసమాజ స్థాపన కోసం మార్క్సిజం-లెనినిజం సిద్ధాంతాలతో ముందుకు సాగాలని జిల్లా కార్యదర్శి నాగరాజు పిలుపునిచ్చారు.