ఈడీ విచారణకు హాజరైన నటి

ఈడీ విచారణకు హాజరైన నటి

బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కేసులో ఈడీ దర్యాప్తు ముమ్మరం చేసింది. దీనిలో భాగంగా నటి, మాజీ ఎంపీ మిమి చక్రవర్తిని ఇవాళ ఈడీ విచారించింది. రేపు నటి ఊర్వశి రౌతేలాను విచారించనుంది. గతంలో ఇదే కేసులో బెంగాలీ నటుడు అంకుష్ హజ్రా, క్రికెటర్స్ సురేష్ రైనా, శిఖర్‌ధావన్‌ను ఈడీ ప్రశ్నించింది. కాగా నటి ఊర్వశి రౌతేలా, మిమి చక్రవర్తికి నిన్న ఈడీ నోటీసులు పంపించింది.