కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌ను సందర్శించిన జిల్లా కోఆర్డినేటర్

కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌ను సందర్శించిన జిల్లా కోఆర్డినేటర్

MDK: రామాయంపేట కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌ను మంగళవారం జిల్లా వైద్య విధాన పరిషత్ కోఆర్డినేటర్ డాక్టర్ శివదయాల్ సందర్శించారు. ఆస్పత్రిలో ప్రజలకు అందుతున్న వైద్య సేవలను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వైద్యుల పనితీరును అడిగి తెలుసుకున్నారు. మందుల నిల్వలు పరిశీలించి పలు రికార్డులను తనిఖీ చేశారు. ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు.