కసాపురం ఆంజనేయ స్వామికి ప్రకారోత్సవం

కసాపురం ఆంజనేయ స్వామికి ప్రకారోత్సవం

ATP: గుంతకల్లు కసాపురం ఆంజనేయస్వామి ఆలయంలో మంగళవారం మాన్య సూక్త హోమం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఆలయంలో స్వామివారి మూలమూర్తికి వేకువజామున విశేష పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయంలోని యాగశాలలో ఆలయ అర్చకులు వేద పండితులు, మాన్య సూక్త హోమాన్ని నిర్వహించారు. మంగళవారం రాత్రి స్వామివారి ఉత్సవ మూర్తికి పల్లకిలో కొలువు తీర్చి ప్రాకారోత్సవం నిర్వహించారు.