రంగు మారిన మంచినీరు ప్రాజెక్టు నీరు

రంగు మారిన మంచినీరు ప్రాజెక్టు నీరు

ELR: ఉంగుటూరు ఎర్ర చెరువు దగ్గర ఉన్న మంచినీటి ప్రాజెక్టుకు సంబంధించి రిజర్వాయర్‌లో నీరు రంగు మారింది. చెరువులో మద్యం సీసాలు చెత్తాచెదారాలు పడేయడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. ఈ ప్రాజెక్టు నుంచి డెల్టాలో 10 గ్రామాలకు పైపులైను ద్వారా మంచినీరు సరఫరా చేస్తున్నారని, ఇందులో నీరు అంతా రంగు మారడంతో గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు. ఆ శాఖాధికారులు పరిశీలించి సమస్య పరిష్కరించాలని కోరుతున్నారు.