యూరియా కోసం బారులు తీరిన రైతులు

SRPT: హుజూర్‌నగర్ మండలం బూరుగడ్డ & మాచవరం సొసైటీ పరిధిలో యూరియా కోసం రైతులు తెల్లవారుజాము నుంచే క్యూ లైన్‌లో నిలబడ్డారు. ఒక ఆధార్ కార్డు ద్వారా రెండు బస్తాలు మాత్రమే యూరియాని అందిస్తున్నారని రైతులు వాపోతున్నారు. యూరియా కొరతతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న అధికారులు పట్టించుకోవట్లేదని ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం, అధికారులు వెంటనే స్పందించాలని డిమాండ్ చేస్తున్నారు.