జిల్లాలో 49 బస్సులపై కేసులు నమోదు
ATP: కర్నూలు వద్ద జరిగిన బస్సు ప్రమాదం నేపథ్యంలో జిల్లా రవాణా శాఖ అధికారులు తనిఖీలు ముమ్మరం చేశారు. 7 రోజుల్లో 114 ప్రైవేట్ బస్సులను పరిశీలించి 49 బస్సులపై కేసులు నమోదు చేశారు. రెండు బస్సులను సీజ్ చేసినట్లు డీటీసీ వీర్రాజు వెల్లడించారు. సీట్ ఆల్టరేషన్స్, భద్రతా పరికరాల పనితీరుపై ప్రధానంగా తనిఖీలు చేశారు.