'ఆపరేషన్ కగారు రాజ్యాంగ విరుద్ధం'
నల్లగొండ లయన్స్ క్లబ్‌లో జరిగిన నిరసన సభలో పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు ప్రో. గడ్డం లక్ష్మణ్ మాట్లాడుతూ.. ఆపరేషన్ కగారు పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమని, ఎన్‌కౌంటర్లు ప్రభుత్వ హత్యలేనని అన్నారు. బీజేపీ ప్రభుత్వం డెడ్‌లైన్ పేరుతో ఆదివాసీలు, మావోయిస్టులను చంపడం కోర్టు ధిక్కారమని పేర్కొన్నారు. ఆపరేషన్ కగారు వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు.