కావలిలో భారీగా అక్రమ రేషన్ పట్టివేత

కావలిలో భారీగా అక్రమ రేషన్ పట్టివేత

NLR: కావలి పట్టణంలో భారీగా అక్రమ రేషన్ పట్టుబడింది. పౌర సరఫరా శాఖ అధికారులు చేపట్టిన వాహన తనిఖీల్లో జండా చెట్టు వీధి వద్ద ఉన్న 10వ నంబర్ రేషన్ దుకాణంలో అక్రమంగా నిల్వ ఉంచిన 154 బస్తాల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్నా బియ్యాన్ని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. బియ్యన్ని అక్రమంగా నిల్వ చేస్తున్న వ్యక్తిపై నాలుగు రోజులుగా నిఘా ఉంచినట్లు సమాచారం.