ఆచంటలో గోదావరికి వరద ప్రవాహం

ఆచంటలో గోదావరికి వరద ప్రవాహం

W.G: ఆచంట మండలంలో గోదావరి వరద ప్రవాహం ఉరకలేస్తోంది. పుష్కర ఘాట్ పైకి వరద నీరు చేరడంతో రైతులు వేసుకున్న కూరగాయ పంటలు నీట మునిగాయి. నది పరివాహక ప్రాంతాల్లో అధికారులు మెడికల్ క్యాంపులను ఏర్పాటు చేశారు. వరద ప్రవాహం మరింత పెరిగితే లంక గ్రామాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.