VIDEO: బల్క్ డ్రగ్ పార్క్‌కు వ్యతిరేకంగా ఆందోళన

AKP: నక్కపల్లి మండలంలో ఏర్పాటు చేయబోయే బల్క్ డ్రగ్ పార్క్‌కు వ్యతిరేకంగా ఆదివారం రాజయ్యపేటలో మత్స్యకారులు ఆందోళనకు దిగారు. ఈ ఆందోళనకు మద్దతు ప్రకటించిన సీపీఎం జిల్లా నేత అప్పలరాజు మాట్లాడుతూ.. విదేశాల్లో నిషేధించిన ఈ పార్క్‌ను ఇక్కడ ఏర్పాటు చేయడం తగదని అన్నారు. మొదటినుంచి మత్స్యకారులతో పాటు ఈ ప్రాంతానికి చెందిన రైతులు దీనిని వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు.