100 మంది విద్యార్థులకు అస్వస్థత

100 మంది విద్యార్థులకు అస్వస్థత

పశ్చిమబెంగాల్ తూర్పు బుర్ద్వాన్‌లోని ఒక ప్రైవేట్ రెసిడెన్షియల్ మదర్సాలో 100 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. రాత్రి తిన్న భోజనం వికటించడంతో కడుపు నొప్పి, వాంతులు, విరోచనాలతో వారంతా ఆసుపత్రిలో చేరారు. వీరిలో 30 మంది 12 ఏళ్లు కన్నా తక్కువ వయసు వారే ఉన్నారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు.