కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఛైర్మన్
MLG: ములుగు మండలం జంగాలపల్లి గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మార్కెట్ కమిటీ ఛైర్మన్ రేగ కళ్యాణి, గ్రంథాలయ ఛైర్మన్ రవిచందర్ ప్రారంభించారు. వారు మాట్లాడుతూ... కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని, రైతు సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని, రైతులు దళారుల మాటలు నమ్మి మోసపోకూడదని అన్నారు.