ఉయ్యూరులో విద్యార్థులకు అవగాహన కార్యక్రమం

కృష్ణా: ఉయ్యూరు టౌన్ సీఐ టీవీవీ రామరావు శక్తి టీమ్ ఆధ్వర్యంలో విశ్వశాంతి పాఠశాలలో నేడు విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. చెడు ఆకర్షణల వల్ల కలిగే ప్రమాదాలు, ఇతర అంశాలపై విద్యార్థులకు ఆయన అవగాహన కల్పించారు. చెడు స్నేహాలు, నిషేధిత వస్తువుల వాడకం వంటి సంఘటనల వల్ల కలిగే నష్టాలపై వివరించారు. మంచి ప్రవర్తనను పాటించి, ధైర్యంగా ఉండాలని చెప్పారు.