రేపు బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు: కలెక్టర్
సత్యసాయి: పుట్టపర్తి కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ మీటింగ్ హాల్‌లో ఏప్రిల్ 5న డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతి వేడుకలు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఉదయం 10 గంటలకు కలెక్టర్ శ్యాంప్రసాద్, ప్రజాప్రతినిధులు, అధికారులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పిస్తారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.