ప్రమాదాలకు నెలవుగా మారుతున్న ట్రాక్టర్ ప్రయాణం
PLD: వ్యవసాయ కూలీలతో తరలి వెళ్తున్న ట్రాక్టర్లు ప్రమాదాలకు గురౌతున్న సంఘటనలు ఎన్నో జరుగుతున్నాయి. ఓవర్ లోడుతో ట్రాక్టర్ డోర్లు తీసి వ్యవసాయ కూలీలను ఎక్కించి తరలిస్తున్నారు. శనివారం ప్రత్తిపాడు మండలంలో ట్రాక్టర్ బోల్తా పడి పలువురికి గాయాలైన సంఘటన నేడు నెలకొంది. ఓవర్ లోడ్ లేకుండా ప్రయాణం చేసేలా ట్రాక్టర్ యాజమాన్యాలకు పోలీసులు కౌన్సిలింగ్ ఇవ్వాలని స్థానికులు కోరుతున్నారు.