గ్రామాల వారీగా యూరియా పంపిణీ ఏవో

SRPT: మునగాల సహకార సంఘం పరిధిలోని రైతులకు యూరియా గ్రామాల వారిగా పంపిణీ చేయనున్నట్లు, మునగాల మండల వ్యవసాయ అధికారి రాజు గురువారం సాయంత్రం ఒక ప్రకటనలో తెలిపారు. శుక్రవారం మునగాల మండలం బరకత్ గూడెం గ్రామంలో పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు. కావాల్సిన రైతులు పట్టాదారు పాస్ పుస్తకం, ఆధార్ కార్డ్ తీసుకొని రావాలని కోరారు.