VIDEO: మృతుల కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే
NLR: అల్లూరు మండలం సింగపేట వద్ద సోమవారం బొలెరో వాహనం తిరగబడి ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందిన ఘటనపై కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ సమాచారం అందుకున్న ఆయన హుటాహుటిన అల్లూరులోని ప్రభుత్వ వైద్యశాలకు చేరుకుని మార్చురిలోని మృతదేహాలను పరిశీలించారు. మృతుల కుటుంబ సభ్యులను ఓదార్చి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.