జీవన్ రెడ్డి BRSలో ఒక్క రోజు మాత్రమే వీఐపీ: ఎంపీ
BHNG: మాజీ మంత్రి జీవన్ రెడ్డిపై ఎంపీ చామల కిరణ్ కూమర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. 'జీవన్ రెడ్డి BRSలో చేరడం ఆ పార్టీ నాయకులకు ఇష్ట్రం లేదు. కాంగ్రెస్ జీవన్ రెడ్డికి సముచిత స్థానం ఇచ్చింది. BRSలో జీవన్ రెడ్డి కేవలం ఒక్క రోజు మాత్రమే VIP. ఆ పార్టీలో చేరడం వలన లాభం కంటే నష్టమే ఎక్కువ. ఆ పార్టీలో చేరిన సీనియర్ నేతల పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందో ప్రజలకు తెలుసు' అని విమర్శించారు.