పోలీసుల అదుపులో 14 మంది నిందితులు
గుంటూరు జిల్లాను గంజాయి రహిత జిల్లాగా మార్చేందుకు పోలీస్ అధికారులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు. నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని చోడవరం గ్రామంలో గంజాయి కార్యకలాపాలు జరుగుతున్నాయన్న సమాచారంతో, నల్లపాడు పోలీసులు, సీసీఎస్ పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించి, గంజాయి కార్యకలాపాలలో పాల్గొంటున్న 14 మందిని అదుపులోకి తీసుకున్నారు.