అక్రమంగా తరలిస్తున్న 240 మద్యం సీసాలు స్వాధీనం

అక్రమంగా తరలిస్తున్న 240 మద్యం సీసాలు స్వాధీనం

కోనసీమ: పుదుచ్చేరి యానాం నుంచి అక్రమంగా కారులో మద్యం తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను సోమవారం ఎదుర్లంక వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కారులో 180 ఎంఎల్ ఉన్న 240 మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ముమ్మిడివరం నగర పంచాయతీ పదో మైలు రాయికి చెందిన విత్తనాలు మహేష్, కొమానపల్లికి చెందిన కొల్లాటి వినయ్ కుమార్‌లను అరెస్టు చేసినట్లు ఎస్సై తెలిపారు.