VIDEO: 'దేవరకొండ కోటను పర్యాటక కేంద్రంగా మార్చాలి'
NLG: 14వ శతాబ్దపు పద్మనాయక రాజుల శౌర్యానికి ప్రతీక దేవరకొండ ఖిల్లా నిలిచింది. 700 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ కోటలో పటిష్ఠమైన రాతిగోడలు, ధాన్యగారాలు, గుర్రపుశాలలు నేటికీ నాటి నిర్మాణ కౌశలానికి సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. ఈ చారిత్రక వారసత్వాన్ని భావితరాలకు అందించేలా ప్రభుత్వం స్పందించి, మౌలిక వసతులు కల్పించి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని స్థానికులు కోరుతున్నారు.