ముదిగొండలో చాకలి ఐలమ్మకు ఘన నివాళులు

KMM: ముదిగొండ మండల గ్రామ పంచాయతీ కార్యాలయంలో తెలంగాణ వీరవనిత చాకలి ఐలమ్మ వర్ధంతిని మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ కార్యదర్శి రామకృష్ణ, రజక కులస్థులు ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రజకులు మాట్లాడుతూ.. చాకలి ఐలమ్మ తెలంగాణ సాయుధ పోరాటంలో మహిళల పక్షాన పోరాడిందని తెలిపారు.