VIDEO: మల్లన్న ఉత్సవాల్లో బోనాల పండుగ
SRD: ఖేడ్ మండలం అనంతసాగర్‌లో ఆదివారం రాత్రి గ్రామస్తులు మల్లన్న ఉత్సవాల్లో బోనాల పండుగను ఘనంగా జరుపుకున్నారు. అంతకుముందు బండి సిడి వేడుక జరిపిన అనంతరం ప్రతి ఇంటి నుంచి మహిళా బోనం ఎత్తుకుని గ్రామంలో ఊరేగింపు నిర్వహించారు. డప్పు బాజా చప్పుళ్ల మధ్య పూనకాలతో మహిళలు నృత్యాలు చేశారు. అనంతరం స్థానిక మల్లన్న దేవుడికి బోనాల సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు.