'సావిత్రిబాయి సేవలు చిరస్మరణీయం'

'సావిత్రిబాయి సేవలు చిరస్మరణీయం'

SRPT: దేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలను జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద ఆమె చిత్రపటానికి ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మహిళా విద్య, సామాజిక సమానత్వం కోసం ఆమె చేసిన కృషి మరువలేనిదని, నేటి తరానికి ఆమె ఆదర్శమని కొనియాడారు.