నిందితుడికి 9 ఏళ్ల జైలు శిక్ష
PPM: సాలూరులోని రెండు చోరీ కేసుల్లో నిందితుడు లోపింటి గణేష్‌కు స్థానిక జేఎఫ్‌సీఎం న్యాయస్థానం కఠిన శిక్ష విధించింది. ఒక కేసులో 6 ఏళ్లు, మరో కేసులో 3 ఏళ్లు.. మొత్తంగా 9 ఏళ్ల జైలు శిక్షతో పాటు రూ. 25,000 జరిమానా విధిస్తూ తీర్పునిచ్చింది. మొబైల్ షాపులో నగదు, ఫోన్లు దొంగిలించడం, ఆలయ హుండీని పగులగొట్టిన కేసుల్లో నేరం రుజువు కావడంతో కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది.