కబడ్డీ పోటీలు ప్రారంభించిన ఎమ్మెల్యే పల్లా
VSP: రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు, ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు శుక్రవారం 67వ వార్డు, గాజువాక హైస్కూల్‌లో అండర్-14 జిల్లా స్థాయి కబడ్డీ పోటీలను ప్రారంభించారు. వందేమాతరం 150వ సెలబ్రేషన్స్ సందర్భంగా ఆయన విద్యార్థులతో కలిసి జాతీయ గీతం ఆలపించారు. విద్యార్థుల్లో దేశభక్తి భావనను పెంచేలా ప్రేరణాత్మకంగా ప్రసంగించారు.