సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును అందజేసిన ఎమ్మెల్యే

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును అందజేసిన ఎమ్మెల్యే

కృష్ణా: పమిడిముక్కల మండలం మంటాడ గ్రామంలో మెరుగు భవ్యశ్రీ అనే లబ్ధిదారురాలికి వైద్య ఖర్చుల నిమిత్తం మంజూరైన రూ. 51,370ల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా నిన్న అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వారికి సీఎం రిలీఫ్ ఫండ్ ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు పాల్గొన్నారు.