ఆత్మహత్యకు యత్నం.. రక్షించిన పోలీసులు

MDK: పాపన్నపేట మండలం ఏడుపాయల వద్ద ఉదృతంగా ప్రవహిస్తున్న నదిలో బ్రిడ్జిపై నుంచి దూకే ప్రయత్నం చేసిన వ్యక్తిని క్యూఆర్టి పోలీసులు రక్షించారు. కొల్చారం మండలం ఎనగండ్లకు చెందిన మంగలి వెంకటేశం (45) కుటుంబ కలహాలతో ఆదివారం బ్రిడ్జిపై నుంచి దూకేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. రక్షించిన పోలీసులను జిల్లా ఎస్పీ అభినందించారు