నిరుపయోగంగా బోటింగ్

సంగారెడ్డిలోని మహబూబ్ సాగర్ చెరువులో బోటింగ్ నిరుపయోగంగా మారింది. ఆరునెలలకు పైగా నిరుపయోగంగా ఉండడంతో బోటింగ్ చుట్టూ గుర్రపు డెక్క పెరిగింది. మరో నెలరోజుల్లో అన్ని తరగతుల విద్యార్థులకు పరీక్షలు పూర్తవుతాయి. అప్పటిలోపు బోటింగ్‌కు మరమ్మతులు చేయించి వినియోగంలోకి తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు. వేసవిలో ఆహ్లాదంగా గడిపేందుకు బోటింగ్ ఉపయోగంగా ఉంటుందని చెప్పారు.