నన్ను ఎవరు అడ్డుకుంటారో చూస్తా: బండి సంజయ్
HYD: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా నేడు బీజేపీ అభ్యర్థి దీపక్ రెడ్డికి మద్దతుగా బోరబండలో కేంద్ర మంత్రి బండి సంజయ్ నిర్వహించనున్న సభకు పోలీసులు అనుమతి రద్దు చేశారు. దీనిపై బండి సంజయ్ స్పందిస్తూ.. ఇది ప్రజాస్వామ్యమా, రజాకార్ల పాలనా? అని ప్రశ్నించారు. అనుమతి లేకున్నా బోరబండకు వస్తున్నానని, ఎవరు అడ్డుకుంటారో చూస్తా అంటూ ఆయన సవాల్ విసిరారు.