VIDEO: స్వాతి నక్షత్ర సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు
JGL: ధర్మపురి క్షేత్రంలోని శ్రీ ఉగ్ర లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో బుధవారం స్వామివారి జన్మనక్షత్రమైన స్వాతి నక్షత్రం సందర్భంగా స్వామి మూలవిరాటు అర్చకులు పంచామృతాలతో వేదమంత్రాలు నడుమ అభిషేకం నిర్వహించారు. సుగంధభరిత, రంగురంగుల పూలమాలలతో, తులసిదళ మాలలతో స్వామివారిని అలంకరించారు. అర్చకులు అష్టోత్తర శతనామార్చనలు, ధూపదీప నివేదన చేసి హారతి సమర్పించారు.