కూటమి ప్రభుత్వంలో పేదలకు భరోసా: ఎమ్మెల్యే
ATP: కడవకల్లు గ్రామంలోని ఎస్సీ, బీసీ కాలనీల్లో MLA బండారు శ్రావణి సోమవారం ఎన్టీఆర్ భరోసా పింఛన్లను ఇంటింటికీ తిరిగి పంపిణీ చేశారు. డయాలసిస్ వ్యాధిగ్రస్తుల పింఛన్‌ను రూ.5 వేల నుంచి రూ.10 వేలకు పెంచడంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని ఆమె తెలిపారు. గతంలో నిలిచిపోయిన పింఛన్లు కూడా కూటమి ప్రభుత్వం మంజూరు చేసి, పేదలకు భరోసా ఇస్తోందని పేర్కొన్నారు.