VIDEO: ఆరో రోజుకు చేరుకున్న ఆర్టీసీ ఉద్యోగుల నిరసన
AKP: నర్సీపట్నంలో ఆర్టీసీ ఉద్యోగులు చేస్తున్న రిలే నిరాహార దీక్షలు సోమవారం నాటికి ఆరో రోజుకు చేరుకున్నాయి. ఉద్యోగులు చోడవరం, విశాఖపట్నంలకి బస్ సర్వీసులు పెంచాలని నినాదాలు చేశారు. అనంతరం ఉద్యోగులు మాట్లాడుతూ.. అనేక డిమాండ్లతో గతంలో ఆర్జీలు ఇచ్చినప్పటికీ అధికారులు పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యలు పరిష్కరించేంతవరకు ఆందోళన కొనసాగిస్తామన్నారు.