మృతుడి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే

మృతుడి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే

MHBD: దంతాలపల్లి మండలం గోపాతండాలో ఇటీవల వ్యవసాయ బావి వద్ద కరెంట్ షాక్‌తో మృతి చెందిన అనిల్ కుమార్ కుటుంబ సభ్యులను నేడు ప్రభుత్వ విప్ డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రాంచందర్ నాయక్ పరామర్శించారు. ఎమ్మెల్యేను చూడగానే బాధిత కుటుంబ సభ్యులు బోరున విలపించి అనంతరం ఎమ్మెల్యేకు జరిగిన ఘటన గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ వైస్ ఛైర్మన్ బట్టు నాయక్ పాల్గొన్నారు.