విశాఖకు కేంద్ర ఇమిగ్రేషన్ బ్యూరో

విశాఖకు కేంద్ర ఇమిగ్రేషన్ బ్యూరో

Vsp: కేంద్ర హోం శాఖ పరిధిలోని ఇమిగ్రేషన్ బ్యూరో కార్యాలయాన్ని విశాఖపట్నంలో ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనివల్ల ఉత్తరాంధ్ర ప్రజలు విదేశీ ప్రయాణాల కోసం హైదరాబాద్, చెన్నై వంటి నగరాలకు వెళ్లాల్సిన అవసరం తప్పుతుంది. ఈ కార్యాలయం ఏర్పాటుతో విశాఖ విమానాశ్రయం నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులు, కార్గో సేవలు మరింత విస్తరించనున్నాయి.