'లోక్ అదాలత్‌లో ఎక్కువ కేసులు రాజీకి సహకరించండి'

'లోక్ అదాలత్‌లో ఎక్కువ కేసులు రాజీకి సహకరించండి'

SKLM: టెక్కలి కోర్టులో మే 10న జరగనున్న జాతీయ లోక్ అదాలత్‌లో ఎక్కువ కేసులు రాజీ చేయడానికి అందరూ సహకరించాలని జూనియర్ సివిల్ జడ్జి ఎస్‌హెచ్ఆర్ తేజ చక్రవర్తి మల్ల అన్నారు. ఈ మేరకు టెక్కలి కోర్టులో బుధవారం న్యాయవాదులు, పోలీసు అధికారులతో వేరువేరుగా సమీక్ష సమావేశాలు నిర్వహించారు. రాజీకి అనుకూలమైన వీలైనన్ని ఎక్కువ కేసులు రాజీకి సహకరించాలని ఆయన కోరారు.