VIDEO: జిల్లాలో డ్రోన్ ద్వారా ప్రత్యేక గస్తీ
ELR: జిల్లాలో డ్రోన్ ద్వారా నిఘా, అసాంఘిక కార్యకలాపాల నిర్మూలనకు పోలీసుల ప్రత్యేక గస్తీ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ రాము మాట్లాడుతూ.. ప్రధానంగా పట్టణంలోని రద్దీ ప్రాంతాలు, నిర్మానుష్యంగా ఉండే ప్రాంతాలు, కాలనీల వెనుక భాగం, అక్రమ కార్యకలాపాలు జరిగే అవకాశం ఉన్న రహస్య స్థావరాలపై నిఘా ఉంచినట్లు తెలిపారు. పోలీస్ సిబ్బంది నేరుగా చేరుకోలేని ప్రాంతాలను కూడా చేరుకోవచ్చన్నారు.