వాజ్ పేయి విగ్రహావిష్కరణకు ఆహ్వానం

వాజ్ పేయి విగ్రహావిష్కరణకు ఆహ్వానం

సత్యసాయి: ధర్మవరంలో ఈ నెల 11న జరిగే అటల్ బిహారీ వాజ్ పేయి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి రావాలని పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి, మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డికి బీజేపీ నేతలు ఆహ్వానం పంపారు. బీజేపీ జిల్లా అధ్యక్షులు శేఖర్, లాయర్ హరికృష్ణ, శరత్ కుమార్ రెడ్డి సహా పలువురు నాయకులు ఈ ఆహ్వాన పత్రికను వారికి ఇవాళ అందజేశారు.