రైలు కింద పడి ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య

TPT: దొరవారిసత్రం రైల్వే స్టేషన్ సమీపంలో ఇంటర్ విద్యార్థి గిరిధర్ (17) ఆత్మహత్య చేసుకున్న ఘటన బుధవారం రాత్రి చోటు చేసుకున్నట్లు రైల్వే ఎస్సై చిన్నకేశవ తెలిపారు. తండ్రి మందలించాడని రైల్వే స్టేషన్ వద్ద టూ వీలర్ నిలిపి సూళ్లూరుపేట - చెన్నైకు వెళ్లే రైలు కిందపడినట్లు ఆయన పేర్కొన్నారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.