నేడు ఈ ప్రాంతాల్లో పవర్ కట్
అనకాపల్లి డివిజన్‌లో నేడు (శనివారం) ఆర్డీఎస్ఎస్ పనుల కారణంగా ఉదయం 9 గంటలనుంచి సాయంత్రం 4 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలుపనున్నట్లు ఈఈ రాజశేఖర్ శుక్రవారం అన్నారు. పాల్తేరు, రేబాక, దిబ్బపాలెం, ఎస్.రాయవరం ఉపకేంద్రాల పరిధిలోని పెదరామభద్రపురం, చినదొడ్డిగొల్లు, పెదపాడు, దుప్పితూరు, మెలిపాక, వెంకటాపురం గ్రామాల్లో విద్యుత్‌కు అంతరాయం ఉంటుందని పేర్కొన్నారు.