ఎన్నికల కోడ్‌కు ముందే మమతా మాస్టర్ స్ట్రోక్
పశ్చిమ బెంగాల్ ఎన్నికల షెడ్యూల్ వెలువడటానికి ముందే సీఎం మమతా బెనర్జీ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు పెండింగ్ డీఏ బకాయిలను విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే పురోహితులు, ముయెజ్జిన్‌ల గౌరవ వేతనాన్ని రూ.500 పెంచి, మొత్తం రూ.2,000కు చేర్చారు. ఈ నెల నుంచే ఇవి అమలులోకి రానున్నాయి.