గౌతు లచ్చన్న జాతికి ఆదర్శనీయం

KDP: స్వాతంత్య్ర సమరయోధుడు, సామాజిక సంస్కర్త సర్దార్ డా. గౌతు లచ్చన్న జాతికి ఆదర్శనీయం అని డీఆర్వో విశ్వేశ్వర నాయుడు తెలిపారు. శనివారం కడప కలెక్టర్ కార్యాలయంలో జరిగిన 116వ జయంతి వేడుకలు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి లచ్చన్న చేసిన కృషి అపూర్వమని అన్నారు. ఈ సందర్భంగా అధికారులు, సిబ్బంది చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు.